అంబలి పంపిణీ కేంద్రాలు ప్రారంభం

నస్పూర్, ఆర్.కె న్యూస్: కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నస్పూర్ పట్టణంలోని సిసిసి కార్నర్, శ్రీరాంపూర్ కాలనీలలో ఏర్పాటు చేసిన అంబలి పంపిణీ కేంద్రాలను ఆదివారం  మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తనయుడు కొక్కిరాల ఉదయ్ చరణ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొక్కిరాల ఉదయ్ చరణ్ రావు మాట్లాడుతూ, వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి, వేడి నుండి ఉపశమనం పొందడానికి కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు, అంబలి పంపిణీ కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గత కొన్ని సంవత్సరాలుగా గెలుపు ఓటములు సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అంబలి పంపిణీ కేంద్రాలు ప్రారంభించడం పట్ల పలువురు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ సురిమిళ్ల వేణు, నాయకులు దర్ని మధు, కుమార్, సంపత్ రెడ్డి, అజయ్ గౌడ్, తిరుపతి, బండి పద్మ, నక్క రాజేశ్వరి, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment