- పోరాట సంఘాలపై కార్మికుల విశ్వాసానికి ఈ విజయమే నిదర్శనం: ఏఐటీయూసీ నాయకులు
- ఎస్సార్పీ-3 గనిపై ఏఐటీయూసీలో చేరిన పలువురు యువ మహిళా కార్మికులు, ఫిట్టర్లు
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ నాయకత్వంలోని జేఏసీ ఘన విజయం సాధించిన సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియాలోని పలు గనులు, డిపార్ట్మెంట్లలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఎస్సార్పీ-3, ఆర్.కె-7, ఎస్సార్పీ-1 తదితర గనులపై గేట్ మీటింగ్‌లు నిర్వహించి కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎస్సార్పీ-3 గనిపై బ్రాంచి కార్యదర్శి ఎస్.కె. బాజీ సైదా, ఆర్.కె-7 గనిపై వైస్ ప్రెసిడెంట్ కొట్టే కిషన్ రావు, ఎస్సార్పీ-1 గనిపై అసిస్టెంట్ బ్రాంచి కార్యదర్శి మోత్కూరి కొమరయ్య
హాజరై కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఆర్టీసీ ఎన్నికల్లో మొత్తం 11 రీజియన్లలో ఏకంగా 9 రీజియన్లను ఏఐటీయూసీ నేతృత్వంలోని జేఏసీ కైవసం చేసుకుని, రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు సంఘంగా అవతరించడం కార్మిక ఐక్యత సాధించిన చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. ఏఐటీయూసీతో పాటు టీఎంయూ, ఎన్‌ఎంయూలు కలిసికట్టుగా సాగించిన ఉద్యమాలకు కార్మికులు పట్టం కట్టారని తెలిపారు. గత ప్రభుత్వం యూనియన్లను రద్దు చేసి హక్కులను కాలరాసే ప్రయత్నం చేసినా, ఆర్టీసీని కాపాడుకోవడానికి కార్మికులు నిలబడ్డారన్నారు. ఇటీవల నిర్వహించిన సమ్మెల ద్వారా వేతన సవరణ, డీఏల సాధనలో ఏఐటీయూసీ కీలకపాత్ర పోషించిందని, సీపీఐ శాసనసభాపక్ష నేత, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎన్నికలు జరిగేలా విశేష కృషి చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు విలీన ప్రక్రియ, వేతన సవరణలను త్వరితగతిన అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఎన్నికల స్ఫూర్తితో సింగరేణిలోనూ కార్మికులంతా ఏకతాటిపైకి వచ్చి హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కాగా, ఎస్సార్పీ-3 గని వద్ద జరిగిన సభలో పలువురు యువ మహిళా కార్మికులు, ఫిట్టర్లు ఏఐటీయూసీ విధానాలకు ఆకర్షితులై యూనియన్‌లో చేరగా, నాయకులు వారికి ఎర్రజెండా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సమావేశాల్లో మైనింగ్ స్టాఫ్ ఇన్చార్జ్ వంగరి రాజేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ రాచర్ల చంద్రమోహన్, జీఎం చర్చల ప్రతినిధులు బద్రి బుచ్చయ్య, అడ్డు శ్రీనివాస్, సంపత్, జిల్లా సెక్రటరీ అఫ్రోజ్ ఖాన్, అధికార ప్రతినిధి రాజ్‌కుమార్, పిట్ సెక్రటరీలు మోతె లచ్చన్న, నర్సింగరావు, మురళి చౌదరి, సారయ్య, లక్ష్మణ్, రవి, సదానందం, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాములుకు అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వేళ మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని మండిపడ్డారు. ప్రతి నెలా రావాల్సిన వేతనాలు, బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దసరా పండుగ వచ్చినా బిల్లులు చెల్లించకపోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. ఎన్నికల హామీ ప్రకారం కార్మికులకు నెలకు రూ. 10,000 వేతనం అందించాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలకు కట్టబెట్టే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దాగం రాజారాం మాట్లాడుతూ… గత 20 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో సేవలందిస్తున్న కార్మికులను 60 ఏళ్లు నిండాయనే సాకుతో తొలగించడం సరికాదన్నారు. తొలగించిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్‌గా రూ. 2 లక్షలు చెల్లించాలని, కోడిగుడ్లు, గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయడంతో పాటు ఉద్యోగ భద్రత, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ కరీమా, ఎండీ రఫియా, జిల్లా కోశాధికారి సవిత, ఉపాధ్యక్షులు మధునమ్మ, రబియా, సహాయ కార్యదర్శులు రమాదేవి, సరిత, జ్యోతి మరియు జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ క్యాంప్‌లో ఈ కార్యక్రమం జరిగింది. “మనసును వినాలి.. మార్పును తేవాలి!” అనే నినాదంతో, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ సందేశం “Lived Experiences, Heard Real Voices, Real Change” ప్రాముఖ్యతను నిపుణులు వివరించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న క్రమంలో విద్యార్థులు ర్యాంకులు, కుటుంబ అంచనాలు, ఆర్థిక సమస్యలతో మానసిక ఒత్తిడికి గురవుతుంటారని, అటువంటి సమయాల్లో సమయపాలన, తగిన విశ్రాంతి, సానుకూల దృక్పథం అలవర్చుకోవాలని సూచించారు. “పరీక్ష మీ లక్ష్యం కావచ్చు కానీ.. అదే జీవితానికి తుది నిర్వచనం కాదు” అని, వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మానసిక ఆందోళన, నిరాశ కలిగినప్పుడు సంకోచించకుండా నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ తీసుకోవడం బలహీనత కాదని, అది ఆరోగ్యం పట్ల తీసుకునే బాధ్యతాయుతమైన నిర్ణయమని స్పష్టం చేశారు. అనంతరం అభ్యర్థులతో మానసిక ఆరోగ్య పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో టీపీఏ జిల్లా అధ్యక్షుడు రంగు వేణు కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన చైతన్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. నారాయణరావు, టీపీఏ సలహాదారు మరియు కృష్ణవేణి విద్యాసంస్థల అధినేత కస్తూరి పద్మ చరణ్, గుండేటి యోగేశ్వర్, విన్నర్ ఐకాన్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్ అధినేత నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేటర్ ఎంబాడి కుమారస్వామితో కలిసి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో వీరాంజనేయ స్వామి ఆలయానికి వచ్చే భక్తుల కోసం సొంత ఖర్చులతో షెడ్ నిర్మిస్తానని ఇచ్చిన మాటను నేడు నెరవేర్చడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు, మహిళలు, వృద్ధులు ఎండ, వానల సమయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా విశ్రాంతి తీసుకునేందుకు ఈ షెడ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఆచరణలో పెట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, డివిజన్లలో నెలకొన్న ప్రజా సమస్యలను గుర్తించి మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు అవసరమైన మరిన్ని సౌకర్యాల కల్పనకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రెంక రవి, 32వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపతి తిరుపతి, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, కాలనీ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మేయర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
టీఎన్జీవో కేంద్ర సంఘ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆసుపత్రిలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు అందుతున్న నగదు రహిత వైద్య సేవలు, పథకం పనితీరుపై ఆయన ఆరా తీసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మారం జగదీశ్వర్ మాట్లాడుతూ… మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు విశ్రాంత ఉద్యోగుల కోసం స్థానిక తిరుపతి ఆసుపత్రితో పాటు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఈహెచ్ఎస్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఉద్యోగులెవరూ ఎలాంటి ఇబ్బందులు పడకుండా నాణ్యమైన వైద్య సేవలు పొందవచ్చని, అర్హులైన వారంతా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘ కార్యదర్శులు పొన్న మల్లయ్య, రాగి శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, మాజీ కార్యదర్శి రామ్మోహన్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, సత్యనారాయణ, నరేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోసిన్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఏసీ ఫంక్షన్ హాల్లో ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ, చారిత్రక శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణ నమూనాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పుర ప్రముఖుల కోసం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు మాట్లాడుతూ.. మంచిర్యాల ఆర్టీసీ డిపోను సుమారు రూ. 30 కోట్ల వ్యయంతో కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 9 ప్లాట్‌ఫామ్‌ల స్థానంలో 18 ప్లాట్‌ఫామ్‌లు, ప్రయాణికుల కోసం అత్యాధునిక విశ్రాంతి గదులు, మినీ థియేటర్, షాపింగ్ మాల్ తదితర సకల హంగులను కల్పించనున్నట్లు తెలిపారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా, దేవాదాయ శాఖ వాస్తుశిల్పి సూచనల మేరకు శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టామని, రాబోయే పుష్కరాల నాటికి ప్రధాన శివాలయాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. సింగరేణి కార్మికుల సమస్యలపై ప్రస్తావిస్తూ.. అధికారుల మాదిరిగానే కార్మికుల ఆదాయపు పన్నును కూడా యాజమాన్యమే భరించేలా తాను చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించి ఆమోదం తెలిపారని వివరించారు. అలాగే అవినీతికి ఆస్కారం లేకుండా సింగరేణి మెడికల్ బోర్డులను కొత్తగూడెంలో కాకుండా ఏరియాల వారీగా నిర్వహించి, పరీక్ష ఫలితాలను అదే
రోజు వెల్లడించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు తూముల నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్లు రామగిరి బానేష్, అక్కల వెంకటేశ్వర్లు, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు పూదరి తిరుపతి, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి గుండ సుధాకర్, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు నలిమెల రాజు, సయ్యద్ షాహిద్ అలీ, జిల్లా ఆర్జీపీఆర్ఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, సింగిల్ విండో చైర్మన్లు నాగభూషణం, ముత్యాల శ్రీనివాస్, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దశాబ్ది ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా ఏర్పాటుకు కృషి చేసిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పార్టీ నాయకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్ల ఆధ్వర్యంలో స్థానిక ఐబీ చౌరస్తాలో సంబరాలు జరిగాయి. అక్కడ ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ దార్శనికత, నాటి ఎమ్మెల్యే దివాకర్ రావు నిరంతర కృషితోనే మంచిర్యాల జిల్లా సాకారమై, పదేళ్లలో అన్ని రంగాల్లో విశేష పురోగతి సాధించిందని ఈ సందర్భంగా నాయకులు గుర్తుచేసుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులను, వివిధ వృత్తి సంఘాల నాయకులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, టీబీజీకేఎస్ నేతలు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీనివాస గార్డెన్స్‌లో నిర్వహించనున్న బతుకమ్మ సంబరాల వాల్‌పోస్టర్‌ను ఆదివారం నస్పూర్ మండల కేంద్రంలోని ఎస్పీ గ్రాండియర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెడ్డి మహిళా సంఘం అధ్యక్షురాలు గోనే మణిమాల రెడ్డి, మేకల వనజా రెడ్డి మాట్లాడుతూ… ఈనెల 14న శ్రీనివాస గార్డెన్స్‌లో అట్టహాసంగా జరిగే బతుకమ్మ వేడుకలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న రెడ్డి సంఘం మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంబరాల్లో భాగంగా చక్కగా తీర్చిదిద్దిన ఉత్తమ బతుకమ్మలకు ప్రత్యేక బహుమతులు అందజేస్తామని తెలిపారు. అలాగే హాజరయ్యే మహిళలందరికీ అల్పాహార వసతి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ రెడ్డి పరివార్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మోతే రాఘవరెడ్డి, గౌరవ అధ్యక్షుడు అనుమాండ్ల వెంకటరెడ్డి, ఉపాధ్యక్షుడు పుప్పిరెడ్డి బాపురెడ్డి, కోశాధికారి చెరుకు చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు మూల విష్ణువర్ధన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కొమ్మిడి మల్లారెడ్డి, ఆళ్ల రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
