అట్టహాసంగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నామినేషన్ కార్యక్రమం

ఆర్.కె న్యూస్, మంచిర్యాల: మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. భార్య సురేఖ, సోదరుడు సత్యపాల్ రావు, కుమారుడు చరణ్ రావు, కోడలు శైలజ లతో కలిసి మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి(ఆర్డీవో) రాములుకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు ప్రేమ్ సాగర్ రావు నివాసం నుంచి ఐబీ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, మహిళల కోలాటాలు, రెపరెపలాడిన కాంగ్రెస్ జెండాలు ర్యాలీలో  ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. తనకు టికెట్ కేటాయించిన పార్టీ అధిష్టానానికి ప్రేమ్ సాగర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ప్రజల్లో నిరంతరం తిరుగుతూ సేవా కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. కరోనా సమయంలో ప్రజలకు ఎమ్మార్పీ ధరకు రెమిడీసివిర్ ఇంజక్షన్ ఇప్పించి ప్రాణాలు కాపాడినట్లు చెప్పారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసినట్లు తెలిపారు. బతుకమ్మ, రంజాన్ పండుగ కానుకలుగా మహిళలకు చీరలు పంపిణీ చేశామన్నారు. అధికారం లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేశామని ప్రజలు తప్పకుండా ఆదరించి గెలిపిస్తారని ప్రేమ్ సాగర్  రావు ధీమా వ్యక్తం చేశారు. ర్యాలీలో మిత్రపక్షమైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, పట్టణ కార్యదర్శి ఖలందర్ ఖాన్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి సోదరుడు గడ్డం అచ్యుతం రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment