🔹 మనం కూర్చుంటే అతను నిలుచొని ఉంటాడు. మనం ఏ సీ.లో ఉంటే అతను ఎండలో ఉంటాడు. మనం నిద్రిస్తుంటే అతని మెలకువతో ఉంటాడు. మన కష్టసుఖాలలో అండగా ఉంటాడు… అతనే పోలీస్.
🔹 సత్యాన్ని శోధించి నేరాన్ని అరికడతాడు. శాంతి భద్రతలకై పరిశ్రమిస్తుంటాడు. సమాజాన్ని కంటి రెప్పలా కాపాడుతుంటాడు. క్రమశిక్షణతో ముందుకు సాగిపోతుంటాడు… అతనే పోలీస్.
🔹 రోడ్ల కూడళ్లలో, అన్ని రహదారుల్లో, రాత్రి పగళ్లలో, మంచి చెడులలో, మండే ఎండల్లో, ఎముకలు కొరికే చలిలో, తుఫాను వానల్లో గస్తీ కాస్తుంటాడు… అతనే పోలీస్.
🔹ఆజ్ఞలను పాటిస్తూ లాఠీ జులిపిస్తాడు, అత్యవసరంలో ఆయుధం ఎక్కు పెడతాడు, ప్రజల భద్రత కై పోరాటం చేస్తాడు, ఖాకి దుస్తులకు అసలైన అర్థం చాటుతాడు… అతనే పోలీస్
🔹 ధైర్య శౌర్యంతో సేవా సంకల్పంతో, సమాజ రక్షణకై సమిద కూడా అవుతాడు. పౌరుల గుండెల్లో శాశ్వతంగా ఉంటాడు. మరణం లేని రక్షక భటునిగా చరితలో నిలుస్తాడు. పోలీసులు మీకోసమే అని చాటి చెబుతాడు… అతనే పోలీస్
🔹 అతనే మన మంచిర్యాల జిల్లా పోలీస్.. అతనే మన తెలంగాణ రాష్ట్ర పోలీస్.
✍ గుండేటి యోగేశ్వర్
కవి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత
పూర్వ ఎన్.సి.సి అధికారి
మంచిర్యాల, సెల్: 9849254747