అయ్యప్ప భక్తుల మాలధారణ

ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ కాలనీ అయ్యప్ప స్వామి సేవా సన్నిధానం భక్తులు శుక్రవారం అయ్యప్ప మాల ధారణ చేశారు.  శుక్రవారం అయ్యప్ప భక్తులు గోదావరి పుణ్య స్నానం ఆచరించి అయ్యప్ప దేవాలయంలో గురు స్వామి చక్రవర్తుల పురుషోత్తమాచార్యలుచే అయ్యప్ప మాల ధరించారు. ఈ సందర్భంగా గురు స్వామి అయ్యప్ప భక్తులకు దీక్షా నియమాలు ఉపదేశించి, నిష్టగా 41 రోజులు అయ్యప్ప స్వామి పూజలు చేసి, ఇరుముడి దాల్చి శబరిమల వెళ్లాలని కోరారు. అయ్యప్ప స్వామి దీక్షలో భక్తులకు ఏకాగ్రత, క్రమశిక్షణ పెరుగుతుందన్నారు. డిసెంబర్ 8న శ్రీరాంపూర్ కాలనీ ప్రగతి స్టేడియంలో కేరళకు చెందిన సంజీవ నంబూద్రి గురు స్వామి చే అయ్యప్ప స్వాముల మహా సంగమం, సామూహిక మహా పడిపూజ, అయ్యప్ప స్వాముల అగ్నిగుండ ప్రవేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  శ్రీరాంపూర్ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి బాస్కర్ల రాజేశం, వర్కింగ్ ప్రెసిడెంట్ సాదు వీరభద్రస్వామి, ఉపాధ్యక్షుడు చకిలం శ్రావణ్, కోశాధికారి సీహెచ్ సదానందం, సహాయ కార్యదర్శి కొండల్ రెడ్డి, శ్రావణ్, బన్నీ, బజ్జూరి లక్ష్మణ్, సభ్యులు వేముల రమేష్, భరత్ రెడ్డి, వేణు, బొద్దున రమేశ్, మల్లెత్తుల శ్రీనివాస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment