- మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
నస్పూర్, ఆర్.కె న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం నస్పూర్ పట్టణంలోని 18, 21 వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే పాల్గొని, లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న స్వంత ఇంటి కల సాకారం కావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క నిరుపేదకు ఇల్లు మంజూరు చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని, నిరుపేద కుటుంబాల సొంతింటి కల నెరవేరాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 లక్షల నిధులతో ఇందిరమ్మ మంజూరు చేస్తున్నారన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.