అలరిస్తున్న అరుదైన “మే పుష్పం”

  • పర్యావరణవేత్త యోగేశ్వర్ ఇంట్లో ఒకే రోజు వికసించిన రెండు మే పుష్పాలు

ఆర్.కె న్యూస్, మంచిర్యాల: సాధారణంగా మే నెల మొదటి వారంలో పూసే అరుదైన అందమైన “మే పుష్పం” వాతావరణంలో చోటు చేసుకుంటున్న పలు కారణాల రీత్యా మే నెల చివరి వారంలో నెలలో పుష్పించి అలరిస్తుంది. మంచిర్యాల జిల్లా  కేంద్రంలోని జన్మభూమి నగర్ నివాసి,  పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ ఇంటి మిద్దె  తోటలో ఒకే రోజు రెండు  “మే పుష్పాలు” పూసి  చూపరులను ఆకట్టుకుంటుంది. మే పుష్పం యొక్క శాస్త్రీయ నామం “స్కా డోక్స స్ మల్టీ ఫోరస్”, ఆంగ్లం లో బ్లడ్ ఫ్లవర్, ఫుట్బాల్ అని ,తెలుగులో వాడుక భాషలో మే నెలలో పూయడం వలన మే పుష్పం అని  పిలుస్తుంటారు. సాధారణంగా మే పుష్పం లిల్లీ మొక్కను పోలి ఉంటుంది. బంతి పువ్వు ఆకారంలో ఎర్రని రంగులో శాఖలుగా విస్తరించి చూపరులను ఇట్టే ఆకర్షించేలా ఉంటుంది. గుండేటి యోగేశ్వర్ ఈ మొక్కను గత 16 సంవత్సరాలుగా సంరక్షిస్తూ అపురూపంగా పెంచుకోవడం విశేషం. ఈ పుష్పం మొగ్గ దశ నుండి పూర్తిగా విచ్చుకోవటానికి సుమారు ఇరవై రోజులు పడుతుంది. ఒకటి  నుండి రెండు ఫీట్ల ఎత్తు వరకు ఆకులను కలిగి ఉంటుంది. ఈ మొక్క గడ్డ ఒకసారి నాటుకుంటే మరణం ఉండదు. అందుకే ఈ మొక్కను మరణం లేని మహా మొక్క అని పిలుస్తుంటారు. ఈ పుష్పాన్ని తనివి తీర చూస్తే మానసిక ఆనందం కలుగుతూ ఒత్తిడి దూరమవుతుందని విశ్లేషణలు ఉన్నాయి. వీటి ఆకులను సైతం అలంకరణ, ల్యాండ్ స్కేటింగ్ లో వినియోగిస్తుంటారు.

పర్యావరణ మిత్రులుగా మారాలి
– పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్
ప్రతి ఒక్కరు పర్యావరణ మిత్రులుగా మారి, పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని రాష్ట్రపతి అవార్డు గ్రహీత, పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ పిలుపునిచ్చారు. సాధారణంగా మే మొదటి వారంలో మే పుష్పం పూస్తుందని, కానీ, మానవ తప్పిదాల వల్ల వాతావరణంలో వస్తున్న మార్పులు,పెరుగతున్న భూతాపం మే పుష్పం వికసించడంలో ఆలస్యానికి ప్రధాన కారణం అవుతుందని తెలిపారు. ప్రతి మనిషి భూ తాపాన్ని తగ్గించే చర్యలు పాటించాలని అన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్  ల   స్థానంలో బట్ట సంచులు వినియోగించాలన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment