అవయవ దానానికి ముందుకు రావాలి

  • ఆర్.కె 7 గనుల గ్రూప్ ఏజెంట్ ఎం. రాముడు

ఆర్.కె న్యూస్, నస్పూర్: మరణానంతరం అవయవాలు దానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆర్.కె 7 గనుల గ్రూప్ ఏజెంట్ మాలోత్ రాముడు అన్నారు. సోమవారం ఆర్.కె న్యూటెక్ గని వద్ద సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్ర దానం, అవయవ దానంపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఏజెంట్ మాలోత్ రాముడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, అవయవ దానం పై ఉన్న అపోహలు వీడాలని తెలిపారు. నేత్రం దానం చేస్తే మరొక్కరికి చూపును ప్రసాదించోచ్చునని పేర్కొన్నారు. ఇప్పటి వరకు నేత్ర దానం చేసిన వారిలో సింగరేణీయులే ఎక్కువగా ఉండటం హర్షనీయన్నారు. సంస్థలోకి కొత్తగా వస్తున్న ఉద్యోగులు నేత్ర, అవయవ దానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. అనంతరం నేత్ర దానం చేసేందుకు ముందుకు వచ్చిన ఉద్యోగులకు ధ్రువ పత్రాలను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కే-న్యూటెక్ గని మేనేజర్ స్వామి రాజు, గుర్తింపు సంఘం పిట్ కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, సదాశయ ఫౌండేషన్ అధ్యక్షుడు సీహెచ్ లింగమూర్తి, సభ్యులు మాక గమేష్, మధు, కె.వెంకటేశం, గని రక్షణాధికారి కొలె రమేష్, సంక్షేమాధికారి పాల్ సృజన్, పిట్ ఇంజినీర్ రాజగోపాల చారి, సర్వే అధికారి పిచ్చేశ్వర్ రావు, అండర్ మేనేజర్ శంకర్, సాత్విక్, ఇతర అధికారులు, నాయకులు తదితరులు  పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment