పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఆర్.కె న్యూస్, నస్పూర్: స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ పోరాట స్ఫూర్తి ని ఆదర్శంగా తీసుకుని వానమాములై సత్యనారాయణచార్యులు 1984వ సంవత్సరంలో శ్రీరాంపూర్ ప్రాంతంలో స్థాపించబడిన శ్రీ భగత్ సింగ్ విద్యా మందిర్ లో 1998-99 విద్యా సంవత్సరంలో పదో తరగతి  చదివిన విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత  ఆదివారం నస్పూర్ లోని సింగరేణి ఫంక్షన్ హాల్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకున్నారు. తొలుత తమతో చదువుకొని మరణించిన స్నేహితులను గుర్తు చేసుకుని వారి ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. తదుపరి ఉపాధ్యాయులతో కలిసి ఆనందోత్సాహాల నడుమ తమ గత జ్ఞాపకాలను, అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. ప్రస్తుతం తాము చేస్తున్న వ్యాపారాలను, ఉద్యోగాలను ఒకరికొకరు చెప్పుకున్నారు. ఒకరినొకరు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వయస్సును మరచి విద్యార్థి దశలోకి వెళ్లి ఆటపాటలతో ఆనందంగా గడిపారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పూల మాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. పిదప సహపంక్తి  భోజనాలు చేశారు. 25 సంవత్సరాల తర్వాత కలిసి చదువుకున్న మిత్రులందరూ ఒకచోట కలుసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మిత్రులతో కలిసి మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment