-
కుడి కాలు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆటో డ్రైవర్‌కు ఆర్థిక భరోసా
-
15 వేల రూపాయల చెక్కు అందజేత.. దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ మండలం ఆర్.కె 6 సుభాష్ నగర్ కాలనీలో అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న బాధితుడికి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచింది. కాలు ఇన్ఫెక్షన్ సోకి వైద్యం చేయించుకోలేని దయనీయ స్థితిలో ఉన్న ఆటో డ్రైవర్ కన్నూరి రాకేష్ పరిస్థితి తెలుసుకున్న ట్రస్ట్ సభ్యులు ఆదివారం బాధితుడి నివాసాన్ని సందర్శించారు. సామాజిక బాధ్యతగా స్పందించి, తక్షణ సహాయం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు.
స్థానిక సుభాష్ నగర్‌కు చెందిన రాకేష్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. నాలుగు సంవత్సరాల క్రితం ఎడమ కాలు ఇన్ఫెక్షన్‌కు గురికావడంతో మోకాలి వరకు తొలగించాల్సి వచ్చింది. ప్రస్తుతం కుడి కాలుకు కూడా అదే తరహా ఇన్ఫెక్షన్ సోకడంతో కనీసం నడవలేని స్థితికి చేరుకున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా మెరుగైన చికిత్స చేయించుకోలేక, జీవనాధారం కోల్పోయిన రాకేష్ ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్‌ను ఆశ్రయించాడు. ఈ మేరకు ట్రస్ట్ కార్యవర్గం క్షేత్రస్థాయిలో బాధితుడి పరిస్థితిని పరామర్శించి ధైర్యం కల్పించింది.
నిరుపేద స్థితిలో ఉన్న ఈ కుటుంబాన్ని కాపాడేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు తమ వంతు సహాయం అందించాలని ట్రస్ట్ ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు బీనవేన సంపత్, అధ్యక్షులు సుంకరి మల్లేష్, ప్రధాన కార్యదర్శి ఎస్కురి వెంకటేష్ పాల్గొన్నారు. సభ్యులు ఏ. కుమార్, కె. తిరుపతి, బి. లక్ష్మణ్ రావు, యస్. మహేందర్, భూమేష్ పాల్గొన్నారు.







