ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డు కొరకు ఈ-కెవైసి చేయించాలి

ఆర్.కె న్యూస్, మంచిర్యాల జిల్లా: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసంధానంతో ఆరోగ్యశ్రీ పథకం పరిధిని 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచి ఉచితంగా వైద్య సేవలు అందించనుందని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్ తెలిపారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా అదనపు కలెక్టర్ చాంబర్లో ఈ.డి.ఎం. సునీల్ తో కలిసి ఈ -కెవైసి చేసి లబ్దిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్దిదారులు చౌకధరల దుకాణాల వద్ద తమ ఈ-కె.వై.సి. ప్రక్రియను పూర్తి చేసుకొని ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డు పొంది ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యశ్రీ కార్డు కొరకు అన్ని కామన్ సర్వీస్ సెంటర్ల నందు ఈ కె.వై.సి. చేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 80 శాతం ఈ-కెవైసి పూర్తి చేయడం జరిగిందని, మిగతా వారి కోసం ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించడం జరిగిందని, ఈ నెల 30వ తేదీ వరకు పూర్తి స్థాయిలో రేషన్ కార్డు లబ్ధిదారులు తమ ఈ-కెవైసి పూర్తి చేసుకునే విధంగా రేషన్ డీలర్లు అవగాహన కల్పించాలని, ఈ-కె.వై.సి. పూర్తి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డు కింద అత్యవసర చికిత్సలు, ఊపిరితిత్తులు, కాలేయం, గుండె, కిడ్నీ, న్యూరో సంబంధిత శస్త్ర చికిత్సలతో పాటు అనేక వైద్య సేవలు అందించడం జరుగుతుందని, నిరుపేదలకు ఆరోగ్యశ్రీ కార్డు ఒక వరమని, ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment