ఆర్.కె న్యూస్, నస్పూర్: మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం నస్పూర్ పట్టణంలోని మార్టిన్ గ్రామర్ హైస్కూల్ లో ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షులుగా మోకపల్లి నాగలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా రంగు శ్రీనివాస్, కోశాధికారిగా పోచంపల్లి వెంకటేష్, ఉపాధ్యక్షులుగా కుందేలు రవి, నరసయ్య, మోయిన్, రంగ రమేష్, జాయింట్ సెక్రటరీగా సౌమ్య, చందు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కర్ర వెంకటేష్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు అసోసియేషన్ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.
230