46
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఇందారం చౌరస్తాలో దివంగత మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి (కాక) విగ్రహం ఏర్పాటు చేసి, కాక చౌక్ అని నామకరణం చేయాలని కోరుతూ సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు మంచిర్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ సెక్రటరీ తోకల సురేష్ యాదవ్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ సెక్రటరీ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి కారణంగా నిరుపేదలకు రేషన్ కార్డులు వచ్చాయని, కార్మికులకు పెన్షన్ తీసుకుంటున్నారని, గతంలో నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థకు కేంద్రం నుంచి నిధులు ఇప్పించి సింగరేణిని లాభాల బాటలో పయనింప చేయడానికి కృషి చేశారని పేర్కొన్నారు. తన విన్నపాన్ని జిల్లా పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.