94
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఈనెల 12న మంచిర్యాల జిల్లా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్ మంచిర్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రేవెల్లి రాజలింగం, వేముల రమేష్ లు తెలిపారు. గురువారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో విలేకరులతో వారు మాట్లాడుతూ, ఈ నెల 12న వీర హనుమాన్ విజయ యాత్ర ఐబీ చౌరస్తా నుండి ప్రారంభమై పట్టణంలోని ప్రధాన కూడళ్ల గుండా లక్ష్మీనారాయణ మందిర్ వరకు సాగుతుందని, ఈ కార్యక్రమానికి విశ్వహిందూ పరిషత్ క్షేత్ర సత్సంగ్ ప్రముఖ్ పండరినాథ్ వక్తగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్ శ్రేణులు, హిందువులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీర హనుమాన్ విజయయాత్రను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షురాలు గొట్టిపత్తి కనకతార, సత్సంగ్ ప్రముఖ్ సురేష్, భజరంగ్ దళ్ మంచిర్యాల కన్వీనర్ అంబటి సంజయ్ కుమార్, పట్టణ మాతృ శక్తి ప్రముఖ్ ముత్యం పద్మ, మాతృ శక్తి సహ సంయోజక్ సంధ్యారాణి, విశ్వహిందూ పరిషత్ సహాయ కార్యదర్శి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.