ఈనెల 24న టిబిజికెఎస్ సర్వసభ్య సమావేశం

  • టిబిజికెఎఎస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిర్యాల రాజి రెడ్డి

ఆర్.కె న్యూస్, నస్పూర్: ఈనెల 24న సాయంత్రం 3 గంటలకు గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో టిబిజికెఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిర్యాల రాజి రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో గోడ ప్రతులను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా టిబిజికెఎస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోని టిబిజికెఎఎస్  శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని సర్వసభ్య సమావేశాన్ని విజయవంతం చేయాలనీ కోరారు. సర్వసభ్య సమావేశంలో కార్మికుల సమస్యలపై చర్చించి తీర్మానాలు చేయడంతో పాటు నూతన కమిటీని ఎన్నుకోనున్నట్లు తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉపరితల గనుల్లో పని వేళలు మార్చడంతో పాటు కార్మికులకు షిఫ్ట్ లో రెండు సార్లు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయాలనీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్ వైద్యం కొరకు ప్రత్యేకంగా ఐడెంటిటీ ఫారం అవసరం లేకుండా శాప్ సమాచారం పరిగణలోకి తీసుకోవాలని, కోరిన కార్పొరేట్ హాస్పిటల్ కు రెఫర్ చేసేలా యాజమాన్య చర్యలు తీసుకోవాలన్నారు. 134 సంవత్సరాల సింగరేణి చరిత్రలో తొలిసారి 70 మిలియన్ టన్నుల బొగ్గు సాధించడం హర్షణీయమని, ఇందుకు కృషి చేసిన ఉద్యోగులకు బంగారు నాణెం బహుమతిగా ఇవ్వాలన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల జ్ఞాపకార్థం స్మారక స్థూపం, స్మృతివనం ఏర్పాటు చేసేందుకు మే డేలోగా నిర్ణయం తీసుకోవాలని యాజమాన్యాన్ని కోరారు. బొగ్గు బావుల ప్రైవేటీకరణతో సింగరేణి ఉనికి ప్రశ్నర్ధకంగా మారే ప్రమాదం పొంచి ఉందన్నారు. వేలం లేకుండా బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెట్టెం లక్ష్మణ్, పానుగంటి సత్తయ్య, బండి రమేష్, తొంగల రమేష్, అన్వేష్, సంతోష్, శ్రీనివాస్,రమేష్, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment