90
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఈనెల 4వ తేదీన మంచిర్యాల నగర పాలక సంస్థ పరిధిలోని నస్పూర్-శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ లో కరీంనగర్ రెనీ హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నస్పూర్-శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భూపతి రవి, రెనీ హాస్పిటల్ జనరల్ మేనేజర్ బంగారి పవన్ ప్రసాద్ లు తెలిపారు. బుధవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో గోడ ప్రతులను ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ, ప్రముఖ వైద్యులతో మెగా ఉచిత వైద్య శిబిరంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్, కార్డియాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, న్యూరాలజీ, గైనకాలజీ, యూరాలజీ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, బిపి, జి.ఆర్.బి.ఎస్, బి.ఎం.ఐ, ఈసీజీ, 2డి ఎకో వంటి ఖరీదైన పరీక్షలు ఉచితంగా నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని, ఈ అవకాశాన్ని మంచిర్యాల జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డిసిపి ఏ. భాస్కర్, శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్ లు ముఖ్య అతిథులుగా హాజరు అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెనీ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ అభిలాష్ రెడ్డి, మెడికల్ క్యాంపు కో ఆర్డినేటర్ పుల్లూరి సుధాకర్, మెడిలైఫ్ హాస్పిటల్ ప్రతినిధులు శంకర్, ఖాసీం, నస్పూర్ ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు బి. రాజేశం, కోశాధికారి కె. నారాయణ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ క్యాతం రాజేష్, జాయింట్ సెక్రటరీ ఏ. మల్లేష్, ఈసీ మెంబర్ తలారి సమ్మయ్య, డిసిప్లినరీ కన్వీనర్ కే. రవికుమార్, బి. రాజ్ కుమార్, నరేందర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.