ఉత్తమ ఫలితాలు సాధనకు “అభినందన” ప్రోత్సాహకాలు

– ప్రధానోపాధ్యాయులు గుండేటి యోగేశ్వర్
ఆర్.కె న్యూస్, మంచిర్యాల: పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకై కృషి చేస్తూ, విద్యాభివృద్ధికి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అంకితభావంతో కృషి చేస్తున్న పలువురు ఉపాధ్యాయులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుండేటి యోగేశ్వర్ ఆధ్వర్యంలో “ప్రతి నెల అభినందన ” పేరుతో  ఉపాధ్యాయుల  కోసం ప్రత్యేక ప్రోత్సాహక  కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జనవరి నెలలో ఇద్దరు ఉపాధ్యాయులు తరగటూరి పావని, బాదావత్ బిక్కులను “ఉత్తమ సేవా ప్రతిభా ప్రశంసా పత్రం” జ్ఞాపిక, శాలువా, పుష్ప గుచ్చాలతో ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ సమాజానికి వెన్నెముక లాంటి ఉపాధ్యాయుని సత్కరించి ప్రోత్సహిస్తే అన్ని రంగాల అభివృద్ధికి తోడ్పాటు ఇచ్చినట్టు అవుతుందన్నారు. పారుపల్లి ఉన్నత  పాఠశాలలో పదో తరగతితో  పాటు అన్ని తరగతులలో ఉత్తమ ఫలితాల సాధనకు విద్యార్థులు బంగారు భవిష్యత్తు కోసం, జ్ఞాన జ్యోతులను వెలిగించడానికి మరింత ఉత్సాహంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో  ఉపాధ్యాయులు  పొగాకు వెంకటేశ్వర్, బి.నరసింగ్, ఏ .సతీష్ కుమార్, పి.వాణి శ్రీ, విలాస్ జాదవ్, కె.సంతోష్ కుమార్, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment