ఉత్పత్తి ,ఉత్పాదకతో పాటు ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్యానికి ప్రాధాన్యత

  • శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి

ఆర్.కె న్యూస్, నస్పూర్:  సింగరేణి సంస్థ ఉత్పత్తి ,ఉత్పాదకతో పాటు కార్మికుల సంక్షేమం, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి తెలిపారు. మంగళవారం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి మాట్లాడుతూ, సెప్టెంబర్ నెలలో ఆర్కే5 గని 89 శాతం, ఆర్కే6 గని 106 శాతం, ఆర్కే7 గని 72 శాతం, ఆర్కే న్యూటెక్ గని 101 శాతం, ఎస్సార్పీ 1 గని 68 శాతం, ఎస్సార్పీ 3,3ఏ గని 91, ఐకే1ఏ గని 68 శాతం ఉత్పత్తితో  భూగర్భ గనులు 84 శాతం ఉత్పత్తి సాధించాయని, ఎస్సార్పీ ఓసి2 63 శాతం, ఐకే ఓసిపి 25 శాతం ఉత్పత్తితో శ్రీరాంపూర్ ఏరియాలో 61 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. అధిక వర్షాల కారణంగా ఉపరితల గనుల్లో ఉత్పత్తికి విఘాతం కలిగినట్లు తెలిపారు. ఆర్ & ఆర్ కాలనీల్లో రహదారులు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటుతో పాటు మొక్కలు నాటినట్లు తెలిపారు. రాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ సిస్టం ద్వారా గోదావరి నుంచి ఉద్యోగుల క్వార్టర్లకు రక్షిత మంచి నీటిని అందిస్తామన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంత ప్రజలు సద్దుల బతుకమ్మ, దసరా పండుగ ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఇప్పటి వరకు 3470 మంది అభ్యర్థులకు కారుణ్య నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారు. సెప్టెంబర్ నెలలో శ్రీరాంపూర్ లో కంపెనీ స్థాయి వాలీబాల్ పోటీలు, సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే వృత్తి విద్యా కోర్సుల శిక్షకులకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు, ఉద్యోగులకు సీఎంపిఎఫ్ చిట్టీలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్వోటు జీఎం సత్యనారాయణ, ఇంచార్జి  డీజీఎం (పర్సనల్) రాజేశ్వర్ రావు, డీజీఎం (ఐఈడి) చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment