- హెల్త్ ఆఫీసర్ లోక్ నాధ్ రెడ్డి
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి ఉద్యోగులు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీరాంపూర్ ఏరియా హెల్త్ ఆఫీసర్ లోక్ నాథ్ రెడ్డి అన్నారు. సోమవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె 6 గని పై ఏరియా హెల్త్ ఆఫీసర్ లోక్ నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా హెల్త్ ఆఫీసర్ లోక్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగులు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. పిల్లలు, వృద్ధులు, ఎండలో పనిచేసే వారి పై ఎండ ప్రభావం ఉంటుందని, అధిక వేడి వల్ల శరీరంలో వచ్చే మార్పులు అనారోగ్యానికి కారణం అవుతుందని, తీవ్రమైన ఎండలో పని చేసేవారు వడదెబ్బకు గురవుతారని పేర్కొన్నారు. ఊబకాయులు, వృద్ధులు, ఎండలో ఎక్కువ సమయం తిరిగే వారికి, మద్యం సేవించే వారికి వడ దెబ్బ తగిలే ప్రమాదం ఉంటుందని, వేసవిలో ఎక్కువ మోతాదులో నీరు తీసుకోవాలని అన్నారు. తదుపరి గని మేనేజర్ తిరుపతి మాట్లాడుతూ, ఉద్యోగులు వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని, మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలని, ఆకుకూరలు, కూరగాయలు, అన్ని రకాల పండ్లు ఆహారంగా తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రక్షణాధికారి కాదాసి శ్రీనివాస్, ఫిట్ ఇంజనీర్ అండె శ్యామ్ కుమార్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఎస్.సురేందర్, గుర్తింపు సంఘం ఫిట్ సెక్రటరీ సంగం సదానందం, నాయకులు సాయి బాబా, అడ్డు శ్రీనివాస్, చిలుక రాంచందర్, వి.సంతోష్ కుమార్, బి. క్రాంతి కుమార్, ఆఫీసు సిబ్బంది, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.