- ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా సింగరేణి ఆసుపత్రులు
- శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి
ఆర్.కె న్యూస్, నస్పూర్: ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనకు సింగరేణి యాజమాన్యం అధిక ప్రాధాన్యత ఇస్తుందని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి అన్నారు. సోమవారం ఆర్.కె 8 డిస్పెన్సరీలో నూతన కారు షెడ్డును జీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ఏరియాలోని సింగరేణి ఆసుపత్రుల్లో కావలసిన అన్ని మౌలిక సదుపాయాలను సంస్థ కల్పిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కావలసిన అన్ని వైద్య సదుపాయాలు ఏరియాలోని రెండు డిస్పెన్సరీలో అందించడం జరుగుతుందని, డిస్పెన్సరీల సేవలు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, ఏజీఎం (ఫైనాన్స్) మురళీధర్, డీజీఎం (పర్సనల్) పి. అరవింద రావు, డిప్యూటీ సీఎంఓ డాక్టర్ పి. రమేష్ బాబు, డాక్టర్లు మురళీధర్, వేద వ్యాస్, లోకనాథ్ రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.