ఎన్నికల విధులను ‘ఆన్ డ్యూటీ’గా పరిగణించాలి

‘స్పెషల్ లీవ్’తో సింగరేణి ఉద్యోగులకు తీవ్ర నష్టం
సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం
ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జెట్టి శంకర్ రావు

నస్పూర్, ఆర్.కె న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం విధులు నిర్వర్తిస్తున్న సింగరేణి ఉద్యోగులకు యాజమాన్యం ‘ఆన్ డ్యూటీ’కి బదులుగా ‘స్పెషల్ లీవ్’ వర్తింపజేయడాన్ని ఐఎన్టీయూసీ తీవ్రంగా ఖండించింది. ఇది ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీయడమేనని ఐఎన్టీయూసీ సీనియర్ కేంద్ర ఉపాధ్యక్షులు జెట్టి శంకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా శంకర్ రావు మాట్లాడుతూ.. సింగరేణి ఉద్యోగులు ఎన్నికల విధుల్లో భాగంగా దూర ప్రాంతాలకు, రవాణా సౌకర్యాలు సరిగా లేని మారుమూల గ్రామాలకు వెళ్లి ఎంతో శ్రమకోర్చి తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని గుర్తుచేశారు. సాధారణంగా ‘లీవ్’ అనేది ఉద్యోగి తన సొంత పనులు లేదా వ్యక్తిగత అవసరాల కోసం విధులకు గైర్హాజరైనప్పుడు వినియోగించుకుంటారని తెలిపారు. కానీ, యాజమాన్యం, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్నికల విధులకు వెళ్తున్న ఉద్యోగులకు ‘స్పెషల్ లీవ్’ ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన విధుల్లో ఉన్నవారిని సెలవులో ఉన్నట్లుగా పరిగణించడం సరైన విధానం కాదని హితవు పలికారు. స్పెషల్ లీవ్ విధానం వల్ల ఉద్యోగులు అనేక విధాలుగా నష్టపోతున్నారని ఆయన వివరించారు. ప్రధానంగా ఈ రోజులను వార్షిక హాజరులో పరిగణించకపోవడం వల్ల, ఉద్యోగులు భవిష్యత్తులో పొందాల్సిన ‘ఆర్జిత లీవుల’ పై కోత పడుతోందన్నారు. అలాగే విధుల్లో ఉన్నప్పుడు వచ్చే అలవెన్సులు, కంపెనీ ఇచ్చే ప్రోత్సాహక ఇన్సెంటివ్‌లు కోల్పోవడంతో కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌ను ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ బి. జనక్ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లినట్లు శంకర్ రావు తెలిపారు. ఈ సమస్యపై సానుకూలంగా స్పందించిన జనక్ ప్రసాద్, వెంటనే సింగరేణి సంస్థ చైర్మన్, సంబంధిత మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించనున్నట్లు తెలిపారన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగికీ ‘ఆన్ డ్యూటీ’ వర్తింపజేసి, వారికి ఎటువంటి ఆర్థిక నష్టం కలగకుండా చూసేందుకు ఐఎన్టీయూసీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment