ఎన్నికల హామీల అమలుకు కృషి

  • గుర్తింపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. సీతారామయ్య

ఆర్.కె న్యూస్, నస్పూర్: గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో భాగంగా కార్మికులకు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తామని అన్నారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, వేజ్ బోర్డు శాశ్వత సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. మంగళవారం గుర్తింపు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆర్.కె 5 గని పై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ కు ముఖ్య అతిథిగా హాజరైన గుర్తింపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ అవగాహన లేని కొన్ని కార్మిక సంఘాలు కార్మికులను అయోమయానికి గురి చేయడానికి, కార్మికుల్లో వారి మనుగడ కొరకు, కార్మికుల్లో ఏఐటియుసికి ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకే లాభాల వాటా పై తప్పుడు ప్రచారాలు చేశాయని అన్నారు. తాము గత 20 సంవత్సరాల నుండి కంపెనీకి వచ్చిన స్థూల లాభం, కంపెనీ అభివృద్ధి కొరకు ఉపయోగించే మొత్తాన్ని మినహాయించి నికర లాభాల మొత్తం నుండి కార్మికులకు పంచిన లాభాల వాటా శాతాన్ని తాము అన్ని గనులలో కార్మికులు అర్థమయ్యే విధంగా గోడ ప్రతులు వేసామని అన్నారు. కార్మికులను అయోమయానికి గురి చేయడానికి ప్రయత్నించిన కార్మిక సంఘాలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. గుర్తింపు కార్మిక సంఘంగా గుర్తింపు పత్రం 8 నెలలు ఆలస్యమైనప్పటికీ తాము కార్మికుల పక్షాన ఉండి ఎప్పటికప్పుడు సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించామని, డిపెండెంట్ ఉద్యోగాల వయోపరిమితిని 35 సంవత్సరాల నుంచి  40 సంవత్సరాలకు పెంచడానికి కృషి చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదా, ఏరియా కార్యదర్శి ప్రసాద్ రెడ్డి, పిట్ కార్యదర్శి గునిగంటి నర్సింగ్ రావు, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అప్రోజ్ ఖాన్, ఎస్ అండ్ పిసి పిట్ కార్యదర్శి ఆడేపు మల్లికార్జున్, పిట్ సహాయ కార్యదర్శి లక్కిరెడ్డి సత్తిరెడ్డి, నాయకులు మాడగొని మల్లేష్, శ్రీకాంత్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment