నస్పూర్, ఆర్.కె న్యూస్: నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ మంచిర్యాల జిల్లా చైర్మన్ గా నస్పూర్ పట్టణానికి చెందిన శ్రీపతి రాములు గౌడ్ ను నియమించినట్లు స్టేట్ చైర్మన్ బద్దిపడగ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీపతి రాములు గౌడ్ మాట్లాడుతూ, సంస్థ నియమ, నిబంధనలు పాటిస్తూ, సంస్థ లక్ష్యాల కోసం పని చేస్తానని, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తానని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూస్తానని, ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తానని, పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని తెలిపారు.
64