– కార్మికుల సొంత ఇంటి పథకం అమలుకు కృషి
– గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీని గెలిపించాలి
– ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య
– ఏఐటీయూసీలో చేరికలు
ఆర్.కె న్యూస్, నస్పూర్
సింగరేణి కార్మికుల హక్కుల సాధన ఏఐటీయూసీతోనే సాధ్యమని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్, ఎస్సార్సీ 1 గనుల పై నిర్వహించిన ద్వార సమావేశంలో ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ ఈనెల 27న జరుగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో దశాబ్దాల ఉద్యమ చరిత్ర కలిగి, కార్మిక వర్గ హక్కులు, సౌకర్యాలే ధ్యేయంగా పని చేస్తున్న ఏఐటీయూసీని నక్షత్రం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కార్మికులను కోరారు. రాబోయే ఎన్నికల్లో ఐటీయూసీని గుర్తింపు సంఘంగా గెలిపిస్తే కోల్ ఇండియా మాదిరిగా అలవెన్స్ లపై పడే టాక్స్ సింగరేణి కార్మికులకు ఇప్పిస్తామన్నారు. ప్రతి కార్మికునికి 200 గజాల భూమి, 20 లక్షలు వడ్డీ లేని రుణాలు యాజమాన్యంతో ఇప్పిస్తామన్నారు. సింగరేణి పాఠశాలల్లో సీబీఎస్ఈ విద్యను అమలు చేయిస్తామన్నారు. నిర్మాణ లేమితో ఉన్న కొన్ని జాతీయ సంఘాలు, ప్రాంతీయ సంఘాలు బలమైన కార్మిక ఉద్యమాలను చేయలేవని అన్నారు. విజ్ఞులైన సింగరేణి ఉద్యోగులు బాగా ఆలోచించి, విచ్ఛిన్నకర పాత్ర పోషిస్తున్న పాలకవర్గ ట్రేడ్ యూనియన్లను ,పైరవీకారి ట్రేడ్ యూనియన్లను ఓడించాలని కార్మికులను కోరారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు ఐటీయూసీలో చేరారు. వీరికి వాసిరెడ్డి సీతారామయ్య కండువా కప్పి యూనియన్ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రెటరీ వీరభద్రయ్య, కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ, బ్రాంచ్ కార్యదర్శి ఎస్.కే బాజీ సైదా, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కొమురయ్య, ఆర్కే న్యూ టెక్ పిట్ సెక్రటరీ ఆకుల లక్ష్మణ్, దాడి రాజయ్య, కామెర వేణు, బెల్లంపల్లి రీజియన్ కాంట్రాక్టు కార్మికుల సంఘం అధ్యక్షుడు అప్రోజ్ ఖాన్, హెడ్ ఓవర్ మెన్ లు చంద్రమోహన్, వెంకటేశ్వర్లు, అదే వెంకటేష్, రాజ్ కుమార్, గని కార్మికులు తదితరులు పాల్గొన్నారు.