ఎలాంటి పొరపాట్లు లేని స్పష్టమైన ఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమైనదని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, దాసరి వేణు, ఆర్డీవోలు రాజేశ్వర్, సురేష్ లతో కలిసి గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ జాబితా తయారీ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించడంలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమైనదని అన్నారు. ఓటరు జాబితా సంకీర్త సవరణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 19వ తేదీ వరకు నూతన ఓటర్ నమోదు, ఓటరు జాబితా సవరణల ప్రక్రియ కొనసాగుతుందని, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల వారు తమ ఏజెంట్లను నియమించి బూత్ స్థాయి అధికారులతో కలిసి స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించేలా కృషి చేయాలని తెలిపారు. ఫోటో ఓటరు జాబితాలో ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
254