“ఓటేద్ధాం రండి” గీత రచయితకు జిల్లా కలెక్టర్ అభినందన

తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటి ఓటు విలువ తెలియపరుస్తూ మంచిర్యాల జిల్లా విద్యాశాఖకు చెందిన గెజిటెడ్ హెడ్ మాస్టర్, కవి, రచయిత, రాష్ట్రపతి అవార్డు గ్రహీత  గుండేటి యోగేశ్వర్  ఓటేద్దాం రండి అనే  “ఓటరు చైతన్య గీతం” రాసి ప్రజల్లో అవగాహన  కల్పిస్తున్నందుకు ఆయనను  జిల్లా కలెక్టర్ బదావత్  సంతోష్ ,అడిషనల్  కలెక్టర్  బి.రాహుల్(ఎల్.బి), ఎస్.మోతిలాల్ (రెవెన్యూ) విద్యాశాఖాధికారి ఎస్.యాదయ్య  వేర్వేరుగా అభినందించారు. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు వేసే ముందు ఎలా ఆలోచించి  ఓటు వేయాలో అవగాహన కలిగించే ఓటరు చైతన్య గీతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఓటర్లను ఎంతగానో ఆలోచింపజేస్తుంది. యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోను చూసిన పలువురు యోగేశ్వర్ ను అభినందిస్తున్నారు. ఈ గీతాన్ని జిల్లా పౌర సంబంధాల అధికారి సంపత్ కుమార్ నేతృత్వంలో మంచిర్యాల జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు గానం అందించగా, సంగీతం వేణు తిరునగరి సమకూర్చారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ “జయహో భారత్” యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment