ఓపెన్ కాస్ట్ గనుల పని వేళలు మార్చాలి

  • ఏఐటీయూసీ నాయకులు

ఆర్.కె న్యూస్, నస్పూర్: అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న కారణంగా ఓపెన్ కాస్ట్ గనుల పని వేళలు మార్చాలని కోరుతూ సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం నాయకులు శ్రీరాంపూర్ ఓసీపీ సేఫ్టీ ఆఫీసర్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిలు కందికట్ల వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా మాట్లాడుతూ తెలంగాణలో ఏడు జిల్లాల్లో ఇప్పటికే 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదు అయ్యాయని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని, వడగాలుల ప్రభావం ఉందని తెలంగాణ ఆరోగ్యశాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిందన్నారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉద్యోగులు అధిక ఉష్ణోగ్రతలు, వడ గాలుల కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వడదెబ్బ తగిలే అవకాశం ఉందన్నారు. యాజమాన్యం తక్షణమే ఓపెన్ కాస్ట్ గనుల్లో షిఫ్ట్ సమయాల్లో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. గుర్తింపు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఓపెన్ కాస్ట్ గనుల్లో షిఫ్ట్ సమయాల్లో మార్పులు చేయాలని గతంలో యాజమాన్యం దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు  వ్యవహరిస్తుందని, వెంటనే యాజమాన్యం స్పందించి ఓపెన్ కాస్ట్ గనుల్లో షిఫ్ట్ సమయాల్లో మార్పులు చేయాలని,  లేని పక్షంలో ఈనెల 6న సింగరేణి వ్యాప్తంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో అర్థనగ్న ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ బ్రాంచ్ సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య ఫిట్ కార్యదర్శి మోతే లచ్చయ్య, గండి సతీష్, మోహన్ రెడ్డి, బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, ఇత్తినేని శంకర్,  రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment