ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియాలో ని ఆర్కే5 గని కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై గని మేనేజర్ అబ్దుల్ ఖదీర్ కు ఏఐటీయూసీ నాయకులు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ నూతన ఎస్.డి.ఎల్ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావాలని, యాజమాన్యం కార్మికుల పై పని భారం తగ్గించాలని, క్యాంటీన్ లో మెనూ ప్రకారం నాణ్యమైన టిఫిన్స్ ఉద్యోగులకు అందించాలని, షిఫ్టులలో పనిచేసే ఎలక్ట్రిషన్, ఫిట్టర్స్ హెల్పర్స్ ఇవ్వాలని, సపోర్ట్ మెన్లకు అవసరమైన పనిముట్లు పని స్థలాల్లో అందుబాటులో ఉంచాలని, పని స్థలాల్లో సరైన గాలి ఉండేలా చర్యలు చేపట్టాలని, ఉద్యోగులకు వారి అవసరాన్ని బట్టి సెలవులు మంజూరు చేయాలని, మ్యాన్ రైడింగ్ ను ఉదయం 9 గంటల వరకు నడపాలని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గని మేనేజర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కే. వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, ఏరియా కార్యదర్శి ప్రసాద్ రెడ్డి, క్లరికల్ నాయకులు బద్రి బుచ్చయ్య, పిట్ కార్యదర్శి గునిగంటి నర్సింగరావు, పిట్ ఉపాధ్యక్షులు మల్లేష్, నాయకులు జిపి రావు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
177