కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య అన్నారు. బుధవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ సింగరేణిలో ఇప్పటివరకు గెలిచిన అన్ని సంఘాలు కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం అయ్యాయని, మితిమీరిన రాజకీయ జోక్యంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉందన్నారు. కార్మికుల సొంతింటి పథకం అమలు చేయాలని, మారుపేర్ల సమస్య పరిష్కరించాలని, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయాలన్నారు. చాలి చాలని జీతాలతో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని, నూతన భూగర్భ గనులు ప్రారంభించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. కార్మికుల శ్రమతో సింగరేణికి లాభాలు తెచ్చారని, లాభాల నుంచి సంస్థ విస్తరణ కోసం కోట్లాది రూపాయలు కేటాయించడం సరి కాదని అన్నారు. అనంతరం తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంలో చేరిన సమ్ము రాజయ్య, పెరక రామస్వామి, దేవేందర్ లకు కండువా కప్పి సంఘంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సమ్ము రాజయ్య మాట్లాడుతూ సంఘం బలోపేతానికి, కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం  ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ నీరటి రాజన్న, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జైపాల్ సింగ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment