కార్మికుల హక్కులను సాధిస్తాం

ఆర్.కె న్యూస్, నస్పూర్
సింగరేణి కార్మికుల హక్కులను ఐఎన్టీయూసీ మాత్రమే సాధిస్తుందని ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షులు జెట్టి శంకర్ రావు, కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు కలవేన శ్యామ్ లు తెలిపారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ3 గనిపై జరిగిన గేట్ మీటింగ్ లో వారు మాట్లాడుతూ, ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ఘన విజయాన్ని అందించి, ప్రభుత్వ ఏర్పాటులో సింగరేణి కార్మిక వర్గం భాగస్వామ్యం అయినట్టే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో గడియారం గుర్తుకు ఓటేసి ఐఎన్టీయూసీ ని గెలిపించాలని, ఐఎన్టీయూసీని గెలిపిస్తేనే సింగరేణి సంస్థకు మనుగడ ఉంటుందని, లేనిపక్షంలో కార్పొరేట్ పెట్టుబడిదారులకు నిలయంగా మారుతుందని తెలిపారు. సింగరేణిలో ఉన్న అన్ని విభాగాల ఉద్యోగులు, కార్మికులకు రావాల్సిన హక్కులు సాధిస్తామని, భవిష్యత్తులో నూతన ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని, యజమాన్యం సకాలంలో కార్మికులకు స్వేటర్లు, బూట్లు, సాక్సులు  నాణ్యమైన పనిముట్లు అందించడం లేదని, పని స్థలాల్లో రక్షణ చర్యలు కరువయ్యాయని,  యాజమాన్యం రక్షణ చర్యలు మీద దృష్టి పెట్టాలని, ప్రశ్నించే కార్మిక సంఘం నాయకులు కరువయ్యారని, పైరవీలు లంచాలకు అలవాటు పడిన అధికారులు, నాయకులు ఉన్నారని, వీటన్నింటికి స్వస్తి పలకాలన్నా, యజమాన్యం నిరంకుశ విధానాలను తిప్పి కొట్టాలన్న ఒక్క ఐఎన్టీయూసితోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గరిగె స్వామి, సమ్ము రాజన్న, రాఘవ రెడ్డి, శీలం చిన్నయ్య, నర్సింగ్, మనోజ్, సమ్మిరెడ్డి, మహేష్, చంద్రమోహన్, వెంకటస్వామి, సుధాకర్,  శ్రీనివాస్, వీరమల్లు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment