- కేసులకు భయపడం, దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం
- ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ కన్వీనర్ సుధాకర్
ఆర్.కె న్యూస్, నస్పూర్: ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆ పార్టీ స్టేట్ కన్వీనర్ దిండి సుధాకర్ అన్నారు. శనివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ, ఈ నెల 18న ఆమ్ ఆద్మీ పార్టీ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నయీమ్ పాషా పై జరిగిన దాడిని ఖండించారు. దాడి, హత్య ప్రయత్నం ఘటన పై ఫిర్యాదు చేసిన సిసిసి నస్పూర్ ఎస్ఐ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ విషయమై స్థానిక ఎస్సై పై రామగుండం కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామని, విచారణ అధికారిని మార్చాలని, నయీమ్ పాషాకు రక్షణ కల్పించాలని అన్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కేసులకు భయపడరని, తప్పుడు కేసులకు భయపడమని, దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. అధికార దుర్వినియోగం, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పై పోరాడుతమని తెలిపారు. నయీమ్ పాషా పై దాడి ఘటన పై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యంగా వ్వవహరిస్తున్న స్థానిక ఎస్సై పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే డిజిపిని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ మెంబర్ రాము గౌడ్, మజీద్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నల్ల నాగేంద్ర ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి నయీమ్ పాషా, నిర్మల్ జిల్లా ప్రెసిడెంట్ హైదర్, రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ విజయ్ మల్లంగి, బోధన్ నియోజకవర్గ ఇన్చార్జ్ జునైద్, కూకట్ పల్లి అసెంబ్లీ ఇంచార్జ్ వికాస్, యమున, లాస్య, సుధారాణి, మంచిర్యాల జిల్లా యూత్ ప్రెసిడెంట్ మేకల శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.