క్లరికల్ సిబ్బంది సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

  • గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఉపరితల గనిలో పని చేస్తున్న క్లరికల్ సిబ్బంది సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా అన్నారు. శుక్రవారం ఈ మేరకు ఓసీపీ ప్రాజెక్ట్ అధికారి, మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా మాట్లడుతూ, వే బ్రిడ్జ్, రైల్వే కరస్పాండెన్స్ బాధ్యతలు నిర్వహిస్తున్న క్లర్కులకు, అన్ని గనులు, డిపార్ట్మెంట్లలో ఇచ్చినట్లు ఇన్సెంటివ్ ఇవ్వాలని, క్లరికల్ సిబ్బంది వాహనాల పార్కింగ్ కోసం ప్రాజెక్ట్ ఆఫీస్ పరిధిలో పార్కింగ్ షెడ్ నిర్మించాలని, అంకితభావంతో పని చేస్తున్న క్లరికల్ ఉద్యోగులను ఉత్తమ ఉద్యోగులుగా గుర్తించి, రాబోయే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రశంసా పత్రాలతో సన్మానించాలని,  క్లరికల్ సిబ్బంది సౌకర్యవంతంగా పని చేసేందుకు అవసరమైన ఫర్నిచర్, పనికి తగినట్లు కంప్యూటర్లు, ప్రింటర్లు సమకూర్చాలనే పలు డిమాండ్లపై వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి రాచర్ల చంద్రమోహన్, జీఎం కమిటీ చర్చల ప్రతినిధి బద్రి బుచ్చయ్య, ఎస్సార్పీ ఓసిపి క్లరికల్ పిట్ ఇన్చార్జి కట్ల రమేష్, క్లరికల్ సిబ్బంది బానేష్, సునీల్, శివ శంకర్, సంజయ్, జయబాబు, సత్యనారాయణ రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
AD 01

Follow Me

images (40)

Leave a Comment