ఆర్.కె న్యూస్, నస్పూర్: సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వం నిషేధించిన గంజాయి అమ్ముతుండగా ముగ్గురు వ్యక్తులను గురువారం అరెస్టు చేసినట్లు మంచిర్యాల రూరల్ సీఐ ఏ. అశోక్ తెలిపారు. మంచిర్యాల రూరల్ సీఐ ఏ. అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. నమ్మదగిన సమాచారం మేరకు పోలీస్ సిబ్బంది తీగల్పహాడ్ శివారులోని క్రషర్ మిల్ చెట్ల పొదల్లో వద్దకు వెళ్ళగా అక్కడ ఉన్న గోదారి రాజు, జాడి వంశీ, సాయి కుమార్ లను పట్టుకున్నట్లు, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 1.5 కిలోల గంజాయి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జల్సాలు, గంజాయి తాగడానికి అలవాటు పడిన నిందితులు భద్రాచలం నుంచి గంజాయిని తక్కువ ధరకు కోనుగోలు చేసి, వారు గంజాయి త్రాగడానికి, ఎక్కువ ధరకు ఇతరులకు అమ్మడానికి కొనుగోలు చేసిన గంజాయిని ఏడుగురు నిందితులు పంచుకునే సమయంలో పోలీసులకు పట్టుబడినట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి, దొరికిన ముగ్గురు నిందితులను మాండ్ కు తరలించినట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్నవారిలో సిసిసి నస్పూర్ సబ్ ఇన్స్పెక్టర్ నెల్కి సుగుణాకర్, ఏఎస్సై ఎజాస్, హెడ్ కానిస్టేబుల్ చుంచు తిరుపతి, పిసి నరేందర్ ఉన్నారు
147