147
ఆర్.కె, న్యూస్, నస్పూర్: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. ఊరు వాడల్లో గణనాథుడి మండపాలు ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. నస్పూర్ పట్టణంలోని శ్రీలక్ష్మి గణేష్ మండలి వద్ద నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం మహిళలు విఘ్నేశ్వరునికి పలు విధాల నైవేద్యాలు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. గణేష్ మండపం వద్ద మహిళలు పెద్ద ఎత్తున దీపాలు వెలిగించారు. గణపతి బప్పా మోరియా, గణేష్ మహారాజ్ కి జై అనే భక్తుల, చిన్నారుల నినాదాలతో గణేష్ మండపం పరిసరాలు మారుమోగాయి. మహిళలు, పిల్లలు, యువకులు లంబోదరుడి పూజల్లో పాల్గొని తమ భక్తి ప్రవత్తులు చాటుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ విఘ్నేశ్వరునికి నిత్య పూజలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జక్కినబోయిన గోపాల్, అనుమండ్ల వెంకట్ రెడ్డి, రామగిరి బాలరాజు, మండల తిరుపతి, క్యాతం రాజేష్, టేకుమట్ల అంజయ్య, గోపతి తిరుపతి, చిందం రాజు, రాయమల్లు, నరేష్, మహిళలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.