గనులు, విభాగాలలో మౌలిక వసతులు కల్పించాలి

  • ఐఎన్టీయూసీ సీనియర్ కేంద్ర ఉపాధ్యక్షులు జెట్టి శంకర్రావు

నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని గనులు, విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ఐఎన్టీయూసీ సీనియర్ కేంద్ర ఉపాధ్యక్షులు జెట్టి శంకర్రావు అన్నారు. ఈ మేరకు సోమవారం ఐఎన్టీయూసీ ప్రతినిధి బృందం డీజీఎం (సివిల్) ఆనంద్ కుమార్ తో చర్చలు జరిపారు.  ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ సీనియర్ కేంద్ర ఉపాధ్యక్షులు జెట్టి శంకర్రావు మాట్లాడుతూ ఆర్.కె 5, ఎస్సార్పీ 3, ఐ.కె 1ఏ, ఆర్.కె 7 గనులలో కార్మికులకు రెస్ట్ హాల్స్, టాయిలెట్లకు అత్యవసర మరమ్మతులు చేపట్టాలని, మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక మౌలిక వసతులు కల్పిచాలని, పిట్‌హెడ్ ల వద్ద స్నానాల గదులు, లాకర్లు కలిగిన రూమ్స్ తక్షణ రిపేర్లు చేయాలని డీజీఎం (సివిల్) ఆనంద్ కుమార్ దృష్టికి తీసుకు వెళ్ళగా, సానుకూలంగా స్పందించి ఏరియా జీఎం పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, కార్పొరేట్ పరిధిలో ఉన్న సమస్యలను సంబంధిత స్థాయికి ప్రతిపాదనలు వెంటనే పంపి, త్వరితగతిన పరిష్కారం వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షులు గరిగ స్వామి, జీవన్ జోయల్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment