గుర్తింపు సంఘం ఎన్నికలు తక్షణమే నిర్వహించాలి

హైకోర్టు తీర్పు ప్రకారం షెడ్యూల్ ప్రకటించి సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. మంగళవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ అడ్డుకునేందుకు యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. మితిమీరిన రాజకీయ జోక్యంతో సంస్థ మనుగడకు ముప్పు ఉందన్నారు. టీబీజీకేఎస్ కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని,  కార్మికుల కోసం చేసుకున్న ఒక్క అగ్రిమెంట్ ఉన్న చూపాలన్నారు. టీబీజీకేఎస్ కార్మికుల కోసం సాధించింది ఏమీ లేదని, మేనేజ్మెంట్ ను అడిగే పరిస్థితి లేదన్నారు. కార్మిక సమస్యల పై అసలు టీబీజీకేఎస్ నాయకులకు అవగాహన లేదన్నారు. ఒక్క రోజు ఉన్న ఉద్యోగం ఇప్పిస్తామన్న టీబీజీకేఎస్ యూనియన్ సంవత్సరం ఉన్న వారికి అవకాశం కల్పించాలన్నారు. 11వ వేజ్ బోర్డ్ వేతన ఒప్పందం పై కోల్ ఇండియా అధికారులు జబల్పూర్ కోర్టులో కేసు దాఖలు చేశారని, కార్మికులకు జీతాలు తగ్గినా, పెరిగిన వేతనాల చెల్లింపు నిలిపివేసినా అక్టోబర్ 5,6,7 తేదీల్లో సమ్మె చేస్తామని, కార్మికవర్గం సమ్మెను విజయవంతం చేయాలన్నారు. కాలపరిమితి ముగిసిన ఎస్.డి.ఎల్ యంత్రాలను మార్చాలని, ఎస్.డి.ఎల్ యంత్రాల్లో నాణ్యమైన లూబ్రికెంట్ ఆయిల్ వాడకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్ కుమార్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ముస్కె సమ్మయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, బ్రాంచ్ ఉపాధ్యక్షులు కొట్టె కిషన్ రావు, కాంట్రాక్టు కార్మిక సంఘం బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, ఆకుల లక్ష్మణ్, సదానందం, రమేష్, రాజయ్య, సందీప్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment