గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమైనది

గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి జరిగినప్పుడే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని, గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమైనదని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల భవన సమావేశ మందిరంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు-2023 ప్రధానోత్సవ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్, మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రితో కలిసి జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామ పంచాయతీల  సర్పంచ్ లు  , పంచాయతీ కార్యదర్శులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు – 2023లో జిల్లాలో గల 310 గ్రామ పంచాయతీలలో 15 గ్రామ పంచాయతీ ఉత్తమ గ్రామ పంచాయతీలు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. జనాభా ప్రాతిపదికన 2 వేల జనాభా కన్నా తక్కువగా ఉన్న గ్రామ పంచాయతీలు-5, 2001 నుండి నుండి 5000 జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు-5, 5 వేల కన్నా జనాభా ఎక్కువగా ఉన్న గ్రామ పంచాయతీలు-5లను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఆయా గ్రామాల్లో ప్రతి నివాసంలో వ్యక్తిగత మరుగుదొడ్లు, తడి చెత్త, పొడి చెత్త ప్రక్రియ నిర్వహణ, ద్రవ్య వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్యం, గోబర్ గ్యాస్ ప్లాంట్, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, వాల్ పెయింటింగ్ లాంటి వివిధ అంశాల ద్వారా మూల్యాంకనం చేసి ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామపంచాయతీ రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. భీమారం మండలం ఎల్కేశ్వరం, భీమారం, కన్నెపల్లి మండలం వీరాపూర్, లక్షెట్టిపేట మండలం రంగపేట్, తిమ్మాపూర్, వెంకట్రావుపేట, బెల్లంపల్లి మండలం లింగాపూర్, హాజీపూర్ మండలం టీకనపల్లి, నెన్నెల మండలం చిత్తాపూర్, జన్నారం మండలం దేవునిగూడ, మందమర్రి మండలం అందుగులపేట్, వేమనపల్లి మండలం నీల్వాయి, చెన్నూర్ మండలం కిష్టంపేట, కాసిపేట మండలం దేవాపూర్, దండేపల్లి మండలం దండేపల్లి గ్రామ పంచాయతీలు ఎంపిక చేసి సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు అవార్డులు అందించడం జరిగిందని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ అవార్డులను స్ఫూర్తిగా తీసుకొని గ్రామాభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని, దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా నిలిచేలా పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సత్యనారాయణ, సంబంధిత శాఖల అధికారులు, సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment