ఆర్.కె న్యూస్, నస్పూర్: నస్పూర్ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 2015, ఆగస్టు 7న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించి, భారత చేనేత లోగోను ఆవిష్కరించడంతో పాటు ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా పరిగణిస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. ఎంతో నైపుణ్యంతో కూడిన వృత్తి చేనేత రంగమని, ప్రస్తుత కాలంలో సరైన ఆదాయం లేక చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులకు పెద్ద ఎత్తున రాయితీలు కల్పించి చేయూత అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ పద్మశాలి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి వేముల సురేష్, శ్రీ లక్ష్మీ గణపతి శివ మార్కండేయ దుర్గాదేవి ఆలయ ప్రధాన కార్యదర్శి కొండ శ్రీనివాస్, కుసుమ శంకర్, సట్కూరి రవీందర్, కుంట రామన్న, మెండె వెంకటి, క్యాతం రాజేష్, కన్నం సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
166