ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని సెంట్రల్ నర్సరీలో ఏరియాలోని గనులు, విభాగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులతో బతుకమ్మ ఆట పాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవరెడ్డి, ఏరియా సేవా అధ్యక్షురాలు రాధాకుమారి, జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) రవి ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ దసరా వేడుకల్లో భాగంగా బతుకమ్మ ఆట పాట కార్యక్రమం నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి, ఏజీఎం (ఫైనాన్స్) మురళీధర్, ఇందారం ఉపరితల గని ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏవీ రెడ్డి, ఇన్చార్జి డిజిఎం (పర్సనల్) రాజేశ్వర్ , పర్చేస్ శ్రీ చంద్రశేఖర్, సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్, సీనియర్ పీవో పి. కాంతారావు తదితరులు పాల్గొన్నారు.
122