మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయలో బాలల దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఫ్యాన్సీ డ్రెస్, డ్రామా, డాన్స్ అంశాల్లో పోటీలు నిర్వహించారు. వివిధ వేషధారణలో ఉన్న విద్యార్థులు అందరినీ ఆకట్టుకున్నారు. తదుపరి పాఠశాల ప్రిన్సిపాల్ జె. ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజు నవంబర్ 14ను బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారని అన్నారు. నెహ్రూకు పిల్లలంటే చాలా ఇష్టమని, పిల్లలు ఆయనను చాచా నెహ్రూ అని పిలిచేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
227