నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి శివ మార్కండేయ దుర్గామాత దేవాలయంలో పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం మార్కండేయ జయంతిని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో జెండా ఆవిష్కరించారు. ఆలయ అర్చకులు శ్రీరాంభట్ల ఆనంద్ శర్మ, శ్రీరాంభట్ల సాత్విక్ శర్మ, శ్రీరాంభట్ల ఆకాష్ శర్మ, దేవరాజు వెంకటరమణల ఆధ్వర్యంలో రుద్రాభిషేకం, రుద్ర హోమం నిర్వహించారు. భక్తుల లలితా సహస్ర నామ పారాయణం, శివ నామ స్మరణతో ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు చిలగా ని బొడ్డయ్య, ప్రధాన కార్యదర్శి, వేముల సురేష్, కోశాధికారి చిప్ప రాజబాబు, గౌరవ అధ్యక్షులు మెండె వెంకన్న, మహిళా అధ్యక్షురాలు బండి పద్మ, దేవాలయ కమిటీ అధ్యక్షులు సిరిపురం రామన్న, ప్రధాన కార్యదర్శి కొండ శ్రీనివాస్, కోశాధికారి కుందారపు రమేష్, రాష్ట్ర కార్యదర్శి చిలువేరు సదానందం, గుండేటి యోగేశ్వర్, గౌరవ అధ్యక్షులు పాడేటి శంకరయ్య, ఆడెపు శంకరయ్య, ఉపాధ్యక్షులు దేవసాని నాగరాజు, కుసుమ శంకర్, సట్కూరి రవీందర్, కటకం లక్ష్మణ్, తౌటం మల్లేష్, ఆడేటి రాజయ్య, కార్యవర్గ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
77