ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు

కాగజ్ నగర్, ఆర్.కె న్యూస్:  ముస్లీం సోదరులు మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని దైవ ఘట్టంగా జరుపుకుని ఆయన పట్ల ప్రేమను, భక్తిని చాటుకున్నారు. ఇస్లాం మతంలో ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇస్లాం మతాన్ని స్థాపించిన చివరి మహ్మద్ ప్రవక్త పుట్టిన రోజునే ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగను జరుపుకుంటారు. కాగజ్ నగర్ పట్టణంలో ముస్లీం సోదరులు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా శుక్రవారం ఘనంగా ర్యాలీ (జులుస్) నిర్వహించారు. ముందుగా జామియా మజీద్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ర్యాలీని మిలాద్ ఉన్ నబీ అడక్ కమిటీ ఆధ్వర్యంలో జామియా మజీద్ ఇమామ్, కమిటీ సభ్యులు ప్రారంభించారు. ఈ ర్యాలీ జామియా మజీద్ నుండి రాజీవ్ గాంధీ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, లారీ చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా, బస్టాండ్, ఓల్డ్ కాలనీ, సర్స్కిల్ నుండి తిరిగి జామియా మజీద్ వరకు చేరుకుంది. ప్రత్యేకంగా వాహనాలను అలంకరించి భక్తిశ్రద్ధలతో ర్యాలీనిర్వహించారు. ఈ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా అందరూ శాంతియుతంగా ఉండాలని నినాదంతో ఐకమత్యంతో కలిసి ర్యాలీ తీసే వారికి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో అరటి పండ్లు, మంచి నీళ్లు, లస్సి, మజ్జిక, పంపిణీ చేశారు.బీఆర్ఎస్, బీఎస్పి, కాంగ్రెస్తో పాటు వివిధ సంస్థల ఆధ్వర్యంలో స్వీట్లు, జ్యూస్, పండ్లు, మంచినీళ్ల బాటిళ్లు పంపిణి చేశారు. కాగజ్ నగర్ డిఎస్పి వహీద్ ఉద్దీన్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ సంద ర్భంగా పలువురు మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకుని ముస్లీం సోదరులందరూ భక్తిశ్రద్ధలతో ఉంటూ సేవ కార్యక్రమాలు చేపట్టడం సంతోషరమని, ప్రతీ ఒక్కరు మహ్మద్ ప్రవక్త అడుగుజాడల్లో నడవాలని వారన్నారు.  ఈ కార్యక్రమంలో మజీద్ ల ఇమాములు, మత పెద్దలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment