ఆర్.కె న్యూస్, నస్పూర్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలను మంగళవారం నస్పూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక సిసిసి కార్నర్ లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ 40 ఏళ్ళ వయస్సులో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని, ఆయన హయాంలోనే దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికాం విప్లవానికి పునాదులు పడ్డాయని అన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కోసం పాటుపడుతూ, కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త తన వంతు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సురిమిళ్ళ వేణు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారి సుధాకర్, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
149