ఆర్.కె న్యూస్, నస్పూర్: మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) 95వ జయంతి వేడుకలు ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం శ్రీరాంపూర్ ఐఎన్టీయూసీ బ్రాంచ్ కార్యాలయంలో ఐఎన్టీయూసీ శ్రేణులు గడ్డం వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు జెట్టి శంకర్ రావు మాట్లాడుతూ కాకా వెంకట స్వామి కార్మిక పక్షపాతి అని, కార్మిక లోకానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జాతీయ సమితి సభ్యులు సిహెచ్ భీమ్ రావు, కేంద్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ గరిగ స్వామి, కేంద్ర నాయకులు పి. రమేష్, తిరుపతి రాజు, ఏ. రవీందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బి. రవి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
126