- నేరాల అదుపులో సిసి కెమెరాల పాత్ర కీలకం
- శ్రీరాంపూర్ ఎస్సై ఎం. సంతోష్
ఆర్.కె న్యూస్, నస్పూర్: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీరాంపూర్ ఎస్సై ఎం. సంతోష్ స్పష్టం చేశారు. శనివారం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉదయ్ నగర్ లో శ్రీరాంపూర్ పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఎస్సై ఎం. సంతోష్ మాట్లాడుతూ నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం భాగంగా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల రక్షణ, భద్రత పోలీసుల బాధ్యత అని, అపరిచితుల సమాచారం పోలీసులకు ఇవ్వాలని కోరారు. యువత చెడు వ్యసనాలకు బానిసగా మారి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. అత్యవసర సమయంలో 100 నంబర్ కి కాల్ చేయాలని, సైబర్ నేరాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని, నేరాల అదుపు, నేరగాళ్ల గుర్తింపులో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, ఆత్మహత్యలు, లైంగిక వేధింపులు, గంజాయి వంటి సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాల పై, వివిధ చట్టాల పై ప్రజలను చైతన్యం చేస్తూ, షీ టీమ్, డయల్ 100 పై స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సరైన వాహన పత్రాలు, నెంబర్ ప్లేట్ సరిగా లేని 25 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.