36
నస్పూర్, ఆర్.కె న్యూస్: చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని తీగల్ పహాడ్ జిల్లా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వామన్ రావు అన్నారు. ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభమైన బడిబాట ముగింపు కార్యక్రమంలో భాగంగా గురువారం పాఠశాలలో నూతన గ్రంథాలయం హల్ ను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సంధ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వామన్ రావు మాట్లాడుతూ, బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు పాఠశాలలో 68 మంది నూతన విద్యార్థులు ప్రవేశం పొందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఇన్చార్జి ఉపాధ్యాయులు వేణుగోపాలరావు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.