చరిత్రలో హైదరాబాద్ ను ముంచిన మూసి వరదలు

హైదరాబాద్ నగరం భారతదేశంలోనే విభిన్న సంస్కృతులకు నిలయంగా సుందర నగరంగా ప్రసిద్ధి చెందింది. ఈ నగరం క్రీస్తుశకం 1591లో కుతుబ్ షాహీ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా చేత చార్మినార్ కేంద్రంగా, మూసి నది ఒడ్డున నిర్మించబడింది.హైదరాబాద్ నగరం నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పాలనలో రాజధానిగా పేరు గాంచింది. హైదరాబాద్  లో తరచుగా వరదలు వచ్చేవి. 1908 సెప్టెంబర్ 27 తెల్లవారుజామున 2 గంటలకు “క్లౌడ్ బరస్ట్” వలన విపరీతంగా వర్షం కురిసింది.1908 సెప్టెంబర్ 28న వరద ఉధృతంగా ప్రవహించి మూసి నది 60 అడుగులకు చేరింది. ఈ వరదల వలన అఫ్జల్ గంజ్ లోని కోల్ సవాడి, ఘన్సీ బజార్ లో అత్యధిక నష్టం వాటిల్లింది. ఈ వరదల్లో దాదాపు 15 వేల మంది ప్రాణాలు కోల్పోయి, 80 వేల ఇండ్లు ధ్వంసం అయ్యాయి. 1860లో నిర్మించిన నిజాం ఆసుపత్రిని ధ్వంసం చేసి అఫ్జల్ ముసల్లం జంగ్, చాదర్ ఘాట్ వంతెనలు కొట్టుకుపోయాయి. స్థానిక భాషలో ఈ వరదలను “తుగ్యాని సితంబర్” అని పిలిచేవారు. ఆనాటి వరదల్లో ఉస్మానియా ఆసుపత్రిలో 200 ఏండ్ల నాటి చింత చెట్టు ఎక్కి 150 మంది ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ విపత్కర పరిస్థితిని చూసి హైదరాబాద్ స్టేట్ ఆస్థాన జ్యోతిష్యుడు “జుమర్ లాల్ తివారి” సలహా మేరకు నిజాం రాజు “మహబూబ్ అలీ ఖాన్” ధోతి ధరించి మూసీ నదిని శాంతింపజేసేందుకు హిందూ మతాచార ప్రకారం నదికి పూలు, పండ్లు, కొబ్బరి కాయలు, పట్టు చీర, బంగారం, వెండి, ముత్యాలు సమర్పించి, పూజలు నిర్వహించారు. వరద సంక్షోభ సమయంలో నిజాం రాజు తన రాజభవనం తెరిచి ప్రజలను ఆదుకోవడం జరిగింది. ఇలాంటి వరదలు మరల రాకుండా 1912 లో “సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు” ఏర్పాటు చేసి నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేశారు. నగర పునర్నిర్మాణం కొరకు సలహాలు సహకారం అందించాలని నిజాం రాజు అలనాటి ప్రఖ్యాత ఇంజినీర్ ” మోక్షగుండం విశ్వేశ్వరయ్య” ను ఆహ్వానించి ఆయన సలహా మేరకు హైదరాబాద్ కు ఉత్తరాన కొన్ని మైళ్ళ దూరంలో రిజర్వాయర్లు నిర్మించారు. ప్రఖ్యాత ఇంజనీర్ “నవాబ్ జంగ్ బహదూర్” ఆధ్వర్యంలో 1920లో మూసీ నదికి అడ్డంగా “ఉస్మాన్ సాగర్” 1927లో ఈసీ (మూసి ఉపనది) పై “హిమాయత్ సాగర్” నిర్మించి హైదరాబాద్ కు తాగు నీటితో పాటు వరదలు నియంత్రించబడ్డాయి.

✍ ఆళవందార్ వేణు మాధవ్,
📱 8686051752,📍హైదరాబాద్.

AD 01

Follow Me

images (40)

Leave a Comment