జనవరి 4న నస్పూర్ పద్మశాలి సంఘం, ఆలయ కమిటీల ఎన్నికలు

వివరాలు వెల్లడించిన అధ్యక్షులు చిలగాని బొడ్డయ్య, సిరిపురం రామన్న

నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పద్మశాలి సంక్షేమ సంఘం, శ్రీ లక్ష్మీ గణపతి శివ మార్కండేయ దుర్గామాత దేవాలయ కమిటీ నూతన కార్యవర్గ ఎన్నికను జనవరి 4వ తేదీన నిర్వహించనున్నట్లు పద్మశాలి సంఘం అధ్యక్షులు చిలగాని బొడ్డయ్య, ఆలయ కమిటీ అధ్యక్షులు సిరిపురం రామన్న తెలిపారు. బుధవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రస్తుత కమిటీల కాలపరిమితి ముగిసిన దృష్ట్యా, పాత కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నూతన కమిటీల ఎంపిక ప్రక్రియను మంచిర్యాల జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు గాధాసు బాబు, గౌరవాధ్యక్షులు గడ్డం సుధాకర్, మందమర్రి పట్టణ అధ్యక్షులు చిలగాని సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు వివరించారు. వచ్చే నెల 4వ తేదీన ఉదయం 10 గంటలకు స్థానిక శ్రీ లక్ష్మీ గణపతి శివ మార్కండేయ దుర్గామాత దేవాలయ ప్రాంగణంలో ఈ ఎన్నిక ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. పద్మశాలి కుల బాంధవులు, స్థానిక భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, నూతన కమిటీల ఎంపిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వేముల సురేష్, చిప్ప రాజబాబు, కొండ శ్రీనివాస్, కుందారపు రమేష్, శరవందం, దేవసాని నాగరాజు, పాటేటి శంకర్, కుసుమ శంకర్, కుందారపు రాములు, సట్కూరి రవీందర్, కుంట రామన్న, ఆడేటి రాజన్న, జక్కెన సర్వేశం తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment