జన్మదిన వేడుకలు ప్రకృతి మిత్రగా జరుపుకోవడం ఆదర్శనీయం

  •  ప్రకృతి మిత్ర స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు గుండేటి యోగేశ్వర్

నస్పూర్, ఆర్.కె న్యూస్: బాలల జన్మదిన వేడుకలు పర్యావరణానికి హాని కలగకుండా ప్రకృతి మిత్ర గా జరుపుకోవడం ఆదర్శనీయమని “ప్రకృతి మిత్ర” స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, పర్యావరణ వేత్త  గుండేటి  యోగేశ్వర్ అన్నారు. ఆదివారం రాత్రి మంచిర్యాల కార్పొరేషన్ పరిధి నస్పూర్ లోని ఓ మాక్స్ విల్లా కాలనీలో గుండేటి సుధీర్,శ్వేత దంపతుల కుమారుడు శౌర్య జన్మదిన దినాన్ని పురస్కరించుకొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్, బేకరీ కి సంబంధించిన కేక్, జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ లేకుండా ప్రకృతి సిద్ధమైన పుచ్చకాయతో కళాత్మకంగా రెండవ జన్మదిన కేక్ తయారు చేశారు. వేడుకలకు హాజరైన బాలలకు, ఆహ్వానితులకు వివిధ పోషకాలు గల ఫలాలు, కూల్ డ్రింక్స్ స్థానంలో సహజమైన పండ్ల రసాన్ని ఇచ్చారు. ప్లాస్టిక్ ప్లేట్లకు  బదులు బాంబో పీల్ కాగితం, ఆకు డొప్పలు వినియోగించారు. దీపాలు ఆరిపే సంస్కృతికి బదులు దీపాలు వెలిగించి ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమానికి హాజరైన పర్యావరణ వేత్త యోగేశ్వర్ మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్, జంక్ ఫుడ్స్ వినియోగంతో పర్యావరణం, ఆరోగ్యానికి జరిగే నష్టాలను వివరించారు. ప్రకృతి మిత్రగా ఆదర్శంగా జరుపుకున్న దంపతులకు పచ్చని మొక్కను కానుకగా అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గుండేటి సుధీర్, శ్వేత దంపతుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆసక్తిగా హాజరై ఎంతో సంతోషం వ్యక్తం చేసి ప్రశంసలు కురిపించారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment