జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

  • టీడబ్ల్యూజెఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత

నస్పూర్, ఆర్.కె న్యూస్: దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు వెంటనే  పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారి పిన్న రాజేశ్వర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజెఎఫ్ మంచిర్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తోట్ల మల్లేష్ యాదవ్, చింతకింది మధుసూదన్ లు మాట్లాడుతూ, జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందడంలో  కీలక పాత్ర పోషిస్తున్నారని, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా  జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ చేయడం లేదని, జర్నలిస్టులు చాలి చాలని జీతాలతో కాలం వెళ్ళదిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు డిమాండ్ చేశారు. అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని స్టిక్కర్లతో పునరుద్ధరించకుండా కొత్త కార్డులు మంజూరు చేయాలని, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందజేయాలని, కరోనా సమయంలో నిలిపివేసిన జర్నలిస్ట్ రైల్వే పాసులను వెంటనే పునరుద్ధరించాలని అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కొరకు త్వరలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా కోశాధికారి క్యాతం రాజేష్, ఉపాధ్యక్షులు గొర్రె లక్ష్మణ్, అరికెళ్ల జీవన్ బాబు, నాయకులు అహ్మద్, జర్నలిస్టులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment